- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అవరాపన్’ సీక్వెల్‌లో దిశా పటాని ఫిక్స్.. హీరో ఎవరంటే?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గత ఏడాది ‘కల్కి’తో సూపర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గత ఏడాది ‘కల్కి’తో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ అమ్మడు వెల్‌కమ్ టూ ది జంగిల్, మలంగి-2, సంఘమిత్ర వంటి చిత్రాల్లో కనిపించబోతుంది. షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో.. తాజాగా,దిశా పటాని ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ ‘అవరాపన్-2’లో హీరోయిన్‌గా కనిపించనున్నట్లు టాక్. ఈ మూవీ స్టోరీ చిత్రబృందం దిశా పటానికి చెప్పగా.. అది నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇందులో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ‘అవరాపన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, భావోద్వేగాలతో ‘అవరాపన్-2’(Avarapan-2) రాబోతుండగా.. నితిన్ కక్కర్(Nitin Kakkar), ముఖేష్ భట్ తెరకెక్కిస్తున్నారు. విశేష్ భట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుండగా.. జనవరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 3న థియేటర్స్‌లోకి రాబోతుంది.






