- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేచురల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న డిజాస్టర్ బ్యూటీ.. జాగ్రత్త నాని అన్న అంటూ కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) హై వోల్టేజ్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.
అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ మూవీలో నాని సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) నటిస్తుందట. అయితే ఈ చిన్నది ‘మిస్టర్ బచ్చన్’(Mister Bachchan) సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ నాని మాత్రం ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మూవీ చేయడం కొంచెం రిస్క్‌తో కూడుకున్న పనే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అవసరమా నాని అన్నా అంటూ నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Link






