అజిత్ కుమార్ ‘AK-64’ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ కన్ఫర్మ్.. ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు రేసింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయినప్పటికీ హిట్ సాధించలేకపోతున్నారు.

అజిత్ కుమార్ ‘AK-64’ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ కన్ఫర్మ్.. ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఓ వైపు రేసింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయినప్పటికీ హిట్ సాధించలేకపోతున్నారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చీ వంటి చిత్రాల్లో నటించిన ఆయన డిజాస్టర్‌ను చవిచూశారు. అయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ తన కెరీర్‌లో 64వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీని రోమియో పిక్చర్స్ బ్చానర్‌పై నిర్మిస్తున్నారు. చిత్రబృందం షూటింగ్ చేయడం కోసం పలు ప్రాంతాలు సెర్చింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదలైనప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా, ‘AK-64’ మూవీలో ఓ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ స్వాసిక(Swasika) కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, స్వాసిక ఇటీవల నటించిన తమ్ముడు, రెట్రో భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద ఘోరమైన రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈసమయంలో స్వాసిక అజిత్ కుమార్‌తో నటిస్తుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాతో పాటు స్వాసిక సూర్య ‘కరుప్పు’ చిత్రంలోనూ కనిపించనుంది.

LINK

Next Story