రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్‌‌పై క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-07 05:53:56  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan) కాంబోలో మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే.

రజనీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్‌‌పై క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan) కాంబోలో మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ దర్శకుడు ప్రదీప్ రంగానాథన్ తెరకెక్కించనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మల్టీస్టారర్‌ వ్యవహారం కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో భారీ యాక్షన్ సినిమా రాబోతున్నట్లు ఇటీవల కమల్ హాసన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ ఈ మల్టీస్టారర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి అవకాశం వచ్చిందా? లేదా అనేది నేను చెప్పాలనుకోవడం లేదు. కానీ గత కొద్ది కాలంగా వస్తున్న తప్పుడు వార్తలకు మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను రజనీకాంత్-కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్‌లో భాగం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను దర్శకత్వం మీద కంటే.. యాక్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఇంతకంటే ఏం చెప్పలేను.

నేను సూపర్ స్టార్‌కు వీరాభిమానిని. ఇప్పటివరకూ విడుదలైన ఆయన మూవీస్‌‌లో అన్ని మొదటి షో చూశాను. నేను నటించిన ‘డ్రాగన్’ రిలీజ్ సమయంలో.. ఆయన ప్రశంసించారు. రజనీ సార్ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story