‘టాక్సిక్’ చిత్రానికి కర్మది బలంలా నిలిచారంటూ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

‘కర్మది’ పాత్రకు సరైన నటుడు దొరక్కపోతే ఈ సినిమా ప్రయాణం చాలా కష్టమయ్యేదని, సుదేవ్ ఆ లోటును భర్తీ చేశారని పేర్కొన్నారు.

‘టాక్సిక్’  చిత్రానికి కర్మది బలంలా నిలిచారంటూ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash)హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’(Toxic). ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార(Nayanthara), హుమా ఖురేషి వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా నుండి 'కర్మది' అనే పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తూ, ఆ పాత్రలో నటించిన సుదేవ్ నాయర్ గురించి గీతూ మోహన్ దాస్ ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది. ఈ ప్రయాణంలో సుదేవ్ పాత్ర , ఆయన మద్దతు ఎంత కీలకమో మేకర్స్ వివరించారు. ‘కర్మది’ పాత్రకు సరైన నటుడు దొరక్కపోతే ఈ సినిమా ప్రయాణం చాలా కష్టమయ్యేదని, సుదేవ్ ఆ లోటును భర్తీ చేశారని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి ఒక నిశ్శబ్ద బలంలా నిలిచారని ప్రశంసించారు.

సుదేవ్ నైపుణ్యం చాలా శక్తివంతమైనదని, అయితే అది ఎప్పుడూ తక్కువ అంచనా వేయబడిందని గీతూ మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఆయన కేవలం తన పాత్రకే కాకుండా, సినిమా మొత్తం ప్రయాణానికి తనను తాను అంకితం చేసుకున్నారని కొనియాడారు. అతిశయోక్తి లేకుండా భావోద్వేగాలను పండించడంలో సుదేవ్ దిట్ట అని, సెట్‌లో ఆయన ఉంటే ఒక రకమైన సానుకూల శక్తి ఉంటుందని తెలిపారు.. ప్రతిభ మాత్రమే ఒక మనిషిని ఎక్కువ కాలం నిలబెట్టదని, మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే ఎవరైనా నిజంగా అభివృద్ధి చెందుతారని దర్శకురాలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సుదేవ్ కేవలం ఒక నటుడిగా ఉండటానికే కాకుండా, సినిమా రంగంలో గొప్ప స్థాయికి ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని నొక్కి చెప్పారు. గతంలో కూడా ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆయన ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, ఉగాది సందడిని ముందే తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ‘టాక్సిక్’లో యష్ కొత్త అవతారాన్ని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Next Story