ఆ డైరెక్టర్ నా బ్రా కప్ సైజ్ అడిగి.. వాటిని తాకి చూస్తానంటూ వేధించాడు: Sherlyn Chopra

by Dishaweb |   (  Updated:2023-07-23 12:23:58  IST  )

బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అసభ్యకరమైన సంఘటనలపై ఓపెన్

ఆ డైరెక్టర్ నా బ్రా కప్ సైజ్ అడిగి.. వాటిని తాకి చూస్తానంటూ వేధించాడు: Sherlyn Chopra
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అసభ్యకరమైన సంఘటనలపై ఓపెన్ అయింది. రీసెంట్‌గా సిద్దార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రెస్ట్ పరిమాణం గురించి చాలామంది తనను వేధించారని చెప్పింది. ‘నువ్వు నీ బ్రెస్ట్ కోసం ఆపరేషన్ చేయించుకున్నావా? అని ఓ డైరెక్టర్ అడిగాడు. అబద్దం చెప్పడానికి కారణాలు ఏమీ లేకపోవడంతో ‘అవును నా బ్రెస్ట్ ఫ్లాట్‌గా ఉండటం నాకు నచ్చలేదు. అందుకే చేయించుకున్నాను’ అని చెప్పాను. దీంతో ఆగకుండా మళ్లీ ‘వాటిని ఓసారి తాకవచ్చా? నీ కప్ సైజ్ ఎంత?’ అని అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన మాటాలకు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఒక నటి కప్ సైజ్ తెలుసుకున్నాకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. కానీ ‘మీకు పెళ్లైంది కదా. స్త్రీ శరీర నిర్మాణం గురించి తెలిసే ఉంటుంది’ అని అడిగితే ‘అవునా? అయినా నేను నా భార్యతో ఎక్కువగా మాట్లాడను’ అంటూ నన్ను టార్గెట్ చేసి వేధించాడు’ అని వాపోయింది. చివరగా తాను ఎన్నోసార్లు మానసిక ఆందోళనకు గురైనప్పటికీ ఎవరికీ, దేనికి లొంగలేదని చెప్పింది.

Also Read: ఇక నా వల్ల కాదు.. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు: నటి కామెంట్స్ వైరల్

Next Story