‘ఉగ్రం’తో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న హీరో

by Disha Web Desk 7 |
‘ఉగ్రం’తో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న హీరో
X

దిశ, సినిమా : అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ‘నాంది’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా.. లాక్‌డౌన్ టైమ్‌లోనే కథ రాసుకున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు చేయని రౌద్ర రసంతో ఈ సినిమా చేయడం నరేష్‌కు ప్లస్ అవుతుందని అనిపించిందన్నాడు. నిత్యం మిసింగ్ వార్తలు చదవడం నుంచే ఈ కథ పుట్టిందని, ఇందులో నాంది కంటే ఎక్కువ ఎమోషనల్, మాస్, ఇంటెన్స్ సన్నివేశాలు ఉంటాయని తెలిపాడు. ఇక మిర్నా మీనన్ మంచి నటి అని, మూడు భిన్నకోణాల్లో కనిపించే పాత్రను చాలా చక్కగా చేసిందని చెప్పుకొచ్చాడు డైరెక్టర్.


Next Story