నిర్మాతతో గొడవలు.. కీలక ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ సుజీత్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-21 13:46:34  IST  )

డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఇటీవల ‘ఓజీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

నిర్మాతతో గొడవలు.. కీలక ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ సుజీత్
X

దిశ, సినిమా: డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఇటీవల ‘ఓజీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య(Danayya) నిర్మించగా.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సుజీత్, నిర్మాత దానయ్య మరో భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఇందులో నాని హీరోగా నటిస్తుండగా.. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈక్రమంలో.. నిర్మాత దానయ్య, సుజీత్ మధ్య గొడవలు తలెత్తడంతో.. నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, సుజీత్ ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన విడుదల చేశాడు. ‘‘సోషల్ మీడియాలో చాలా చాలా చెబుతున్నారు. కానీ ఈ సినిమాను స్టార్టింగ్ నుండి ఫినిష్ చేసే వరకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఓజీ కోసం నా నిర్మాత, నా టీమ్ ఇచ్చిన సపోర్ట్ నమ్మకాన్ని నేను మాటల్లో చెప్పలేను. ‘ఓజీ’ మూవీ పట్ల పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ వర్ణించలేనిది. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. దయచేసి తప్పుడు వార్తలు నమ్మకండి. దానయ్య నాకు ఇచ్చిన సపోర్ట్, నమ్మకానికి ఆయనకు నా ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో సుజీత్’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

link

Source : https://x.com/Sujeethsign/status/1980543166131675477

Next Story