Director SS Rajamouli.. దసరా సినిమా దర్శకుడిని ఆకాశానికి ఎత్తేశాడుగా

by Disha Web Desk 10 |
Director SS Rajamouli.. దసరా సినిమా దర్శకుడిని  ఆకాశానికి ఎత్తేశాడుగా
X

దిశ, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా " దసరా ". ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాని పాత్ర డబుల్ మాస్ గా ఉండబోతుంది. టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ పుట్టిస్తున్నాయి.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దసరా టీజర్‌ను నిన్న సాయత్రం తెలుగులో విడుదల చేశారు. టీజర్ ను చూసిన రాజమౌళి దసరా టీం ను మాటలతో పొగిడేశారు. 'దసరా టీజర్ విజువల్స్ నాకు బాగా నచ్చాయి. నాని భారీ మేక్ఓవర్ చూడటానికి బావుంది. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి విజివల్స్ తో సినిమాను తీయడం చాలా బాగుంది. చివరి షాట్ అయితే చాలా నచ్చింది.మీకు అంతా మంచి జరగాలి..' అని ట్విట్టర్ ద్వారా అయన ట్వీట్ చేశారు.

ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేయడంతో దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆనందంలో తేలి పోతున్నాడు. 'సార్.. మీ ట్వీట్‌కు నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. మీకు ఇంగ్లిష్‌లో రిప్లై పెడదాం అనుకున్నా.. కానీ తెలుగులోనే మాటలు వస్తలేవు సార్. కోతి లెక్క గెంతుతున్నా.. మీకు ధన్యవాదాలు సార్..' అంటూ రాజమౌళి ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.

Next Story

Most Viewed