Pawan Kalyan కొడుకు ఫొటో షేర్ చేసిన దర్శకేంద్రుడు.. సినిమాలకు సిద్ధమయినట్లేనా..?

by Disha Web Desk 7 |
Pawan Kalyan కొడుకు ఫొటో షేర్ చేసిన దర్శకేంద్రుడు.. సినిమాలకు సిద్ధమయినట్లేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి అందరికీ తెలిసిందే. తల్లి రేణూ దేశాయ్ వద్ద ఉంటూ అకీరా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుండాడు. అకీరా ఎక్కడ కనిపించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తుంటారు. ముఖ్యంగా అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇదిలా ఉంటే.. అకీరా నందన్ ఫొటో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆ ఫొటోలో దర్శకుడు రాఘవేంద్రరావు ఉండటం విశేషం. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అకీరా కూడా సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడా అంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : చిరంజీవి పై ఈయనకున్న అభిమానానికి సెల్యూట్.. చిరు కోసం ఏమి చేసాడో తెలుసా?



Next Story

Most Viewed