ముందు అక్కడే చూస్తాను.. హీరోయిన్ల బాడీ షేప్స్ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు బోల్డ్ కామెంట్స్

by Bhoopathi Nagaiah |

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. తెలుగు ఇండస్ర్టీకి ఎంతో మంది హీరోహీరోయిన్లను పరిచయం చేసి.. తనకంటూ గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు.

ముందు అక్కడే చూస్తాను.. హీరోయిన్ల బాడీ షేప్స్ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. తెలుగు ఇండస్ర్టీకి ఎంతో మంది హీరోహీరోయిన్లను పరిచయం చేసి.. తనకంటూ గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ర్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. హీరోయిన్లపై వైరల్ కామెంట్స్ చేశాడు.

‘వయస్సులో ఉన్న అమ్మాయిలందరూ అందంగా ఉంటారు. కొంతమంది కళ్లు అందంగా ఉంటాయి. మరి కొంతమంది నవ్వు అందంగా అంటుంది. ఇంకొంత మంది నడక అందంగా ఉంటుంది. మరికొందరి షేప్ అందంగా ఉంటే.. చాలా మందిలో మాట్లాడే పద్ధతి అందంగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన వారిలో నేను ముందు మొహం చూడను. హైట్, నడుము, షేప్, బాడీ స్ట్రక్చర్ చూస్తాను. వాటి ద్వారా ప్లస్ పాయింట్లపై ఫోకస్ పెట్టి హీరోయిన్లను అందంగా చూపించడానికి ప్రయత్నిస్తాను’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story