- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్ముట్టి సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ కామెంట్స్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఫుల్ షామ్‌లో ఉన్న ఆయన ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది కాలంపాటు సినిమా షూటింగ్‌లకు దూరం అయి చికిత్స పొందుతున్నారు. ‘పేట్రియాట్’(Patriot) షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు కోలుకుని మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతారా అని వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, డైరెక్టర్ మహేష్ నారాయణన్ (Mahesh Narayanan) మమ్ముట్టి మళ్లీ షూట్‌లో జాయిన్ కాబోతున్నట్లు వెల్లడించాడు.
‘‘నేను శబరిమలలో అతని కోసం ప్రార్థించాను.. అవి ఫలించాయనిపిస్తుంది. అక్టోబర్ 1 నుంచి మమ్ముట్టి గారు సెట్స్‌లోకి రానున్నారు. మా ఆనందానని మాటల్లో చెప్పలేం. ఆయన రెస్ట్ తీసుకుంటూ కూడా ‘పేట్రియాట్’ గురించి ఆలోచించేవారు. నేను ప్రతిరోజూ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చేవాడిని. లోకేషన్‌లో లేకపోయినప్పటికీ షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ‘వేట్రియాట్’ చిత్రం మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కాంబోలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు.






