'జాతిరత్నాలు' కాంబినేషన్ రిపీట్.. థియేటర్లలో మరోసారి రచ్చే!

by Dishanational4 |
జాతిరత్నాలు కాంబినేషన్ రిపీట్.. థియేటర్లలో మరోసారి రచ్చే!
X

దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా 'జాతిరత్నాలు'.ఈ సినిమాలో తన నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. అయితే 'జాతిరత్నాలు' సినిమా ద్వారా తమది తిరుగులేని కాంబినేషన్‌ అనిపించుకున్న అనుదీప్, నవీన్.. ‌ ప్రేక్షకులకు సరికొత్త కామెడీని పరిచయం చేసి ఫుల్ క్రేజ్ సంపాదించారు. కాగా మరోసారి వీరద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనుదీప్ ఇప్పటికే నవీన్‌కు ఓ కథ చెప్పగా.. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఇది 'జాతిరత్నాలు 2'గా తెరకెక్కుతుందా? లేదా కొత్త కథనా? తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : కంగన సినిమాలో విక్రమ్ గెస్ట్ రోల్..?


Next Story

Most Viewed