- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీరియస్ మోడ్‌లోకి డైరెక్టర్ అనుదీప్.. ఆ స్టార్ హీరోయిన్‌తో సరికొత్త ప్రయోగం..?
టాలీవుడ్‌లో హాస్య డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ కె.వి. అనుదీప్(KV Anudeep) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో హాస్య డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ కె.వి. అనుదీప్(KV Anudeep) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ‘పిట్టగోడ’(Pittagoda), ‘జాతిరత్నాలు’(Jathirathnalu) వంటి సినిమాలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అయితే ఆ తర్వాత శివ కార్తికేయన్(Shiva Karthikeyan)తో తెరకెక్కించిన ‘ప్రిన్స్’(Prince) అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్(Vishwak Sen), కయాదు లోహర్(Kayadu Lohar) జంటగా ‘ఫంకీ’(Funky) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల అవుతుందనే ప్రచారం జరిగినా, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కామెడీ కథలకే పరిమితమైన అనుదీప్, తొలిసారి పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన చేయబోయే నెక్స్ట్ మూవీను ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఇది అనుదీప్ ఫిల్మోగ్రఫీలోనే తొలిసారి జరిగే ప్రయోగం కావడంతో ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు మరింత బజ్ తెచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందానా పేరు.
ఎందుకంటే అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సీరియస్ సినిమాలో రష్మిక(Rashmika Mandanna) లీడ్ రోల్ పోషించనుందనే సమాచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్న రష్మిక, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, బలమైన ఎమోషనల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు కామెడీ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనుదీప్, తన తొలి సీరియస్ సినిమా కోసం రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం కలిసిరావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.






