- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హద్దులు దాటిన కామెంట్స్.. హ్యాండిల్ చేయలేకపోతున్నా
by Kodari Anjali |
సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌పై డింపుల్ హయాతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా: సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌పై డింపుల్ హయాతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘రామబాణం’తో ప్రేక్షకుల ముందుకురానున్న ఆమె తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. నిజానికి తాను నెట్టింట వచ్చే నెగెటీవ్ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనని, ముఖ్యంగా మీమ్స్‌ను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తానని చెప్పింది. అయితే కొన్నిసార్లు హద్దు దాటిన మాటలను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాకపోవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతానన్న నటి.. తాము అందరిలాగే మనుషులమే కాబట్టి అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయని తెలిపింది. ఇక ఓ అభిమాని ‘మీకు గుడి కట్టాలనుకుంటున్నాను. పాలరాతితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా?’ అని అడిగాడు. ‘పాలరాతి, ఇటుకలతో వద్దు. బంగారంతో కట్టినపుడు చెప్పండి’ అంటూ డింపుల్ ఫన్నీగా ఆన్సర్ చేసింది.
Next Story






