‘ఎల్లమ్మ’ విషయంలో వేణు నా మాట వినట్లేదు.. నానిని తీసుకున్నామంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వేణు యెల్దండి(Venu Yeldandi) ‘బలగం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు.

‘ఎల్లమ్మ’ విషయంలో వేణు నా మాట వినట్లేదు.. నానిని తీసుకున్నామంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వేణు యెల్దండి(Venu Yeldandi) ‘బలగం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో వేణు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన ‘ఎల్లమ్మ’(yellamma) అనే ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇక ఇందులో నితిన్ (nithin)హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా? అప్డేట్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు (dil raju) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘వేణు ‘బలగం’ సినిమాను 55 రోజుల్లో చేశాడు. ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి ‘తమ్ముడు’ మూవీలా చేద్దామని అంటున్నాడు.

‘ఎల్లమ్మ’ విషయంలో వేణు నా మాట వినట్లేదు. నాకు ఆయనను ఒప్పించడానికే 6 నెలలు పట్టింది. వేణు రియాలిటీలోకి వచ్చి సినిమా చేద్దాం. నా ‘తమ్ముడు’ మూవీ సమయంలో నాన్ థియేట్రికల్ 45 వేసుకుంటే 35కు పడిపోయింది. మార్కెట్‌ను బట్టి మనం సినిమాను ఎలా తీయాలని హోమ్‌వర్క్ చేస్తాం. ఇంతకు ముందు ఎలా తీశాము ఇప్పుడు ఎలా తీయాలి అని ఓ నిర్ణయానికి వస్తాము. స్క్రిప్ట్‌ను బట్టి ఆఫీసులోనే లాక్ అయిపోవాలి. అయితే ఈ మూవీలో ముందుగా నాని తీసుకోవాలనుకున్నాము. ఆయనకున్న కమిట్‌మెంట్లలో ‘ప్యారడైజ్’ ఉందని చెప్పాడు. అందుకే నితిన్‌ను తీసుకున్నాము. ‘ఎల్లమ్మ’ను రియాలిటీతో చేయాలి. అన్ని కరెక్ట్‌గా సెట్ కావాలి’’ అని చెప్పుకొచ్చారు.

Next Story