- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో వస్తున్న పవన్ కళ్యాణ్ ?
పవన్ కళ్యాణ్ కంటే ముందు ఇద్దరు బాలీవుడ్ హీరోల వద్దకు వంశీ పైడిపల్లి వెళ్లినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో డిప్యూటీ పదవి దక్కించుకున్నారు. ఇంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఓ గాసిప్ బయటకు వచ్చింది.
పవన్ కళ్యాణ్ కంటే ముందు ఇద్దరు బాలీవుడ్ హీరోల వద్దకు వంశీ పైడిపల్లి వెళ్లినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొదట అమీర్ ఖాన్ ఈ స్క్రిప్ట్ విన్నాడట. కథ బాగుందని చెప్పిన తర్వాత సినిమా ప్రారంభం కాబోతున్న తరుణంలో సైడ్ అయిపోయాడట అమీర్ ఖాన్. దీంతో వెంటనే సల్మాన్ ఖాన్ డోర్ కొట్టారట వంశీ. ఆయన కూడా సినిమాను వద్దనుకున్నారట. ఇలా ఇద్దరు రిజెక్ట్ చేసిన కథను పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కథ కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సెట్ అవుతుందని కూడా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.






