- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్‌పై శిరీష్ వివాదాస్పద కామెంట్స్.. అసలు నిజాలు బయటపెట్టిన దిల్ రాజు! (వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(dilraaju), శిరీష్ రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయినట్లు అప్పట్లో పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌పై చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రతి ఒక ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ గురించి అడుగుతున్నారు. నేను రామ్ చరణ్, శంకర్ గారితో క్లోజ్‌గా ట్రావెల్ అయ్యాను. ఆ సినిమా వర్క్ మొత్తం నేను చూసుకున్నాను. శిరీష్ గారు ఆ మూవీలో ఇన్వాల్వ్ కాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మొత్తం ఆయన చూసుకున్నారు.
నేను అందుకే అన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. ఎక్కడా కూడా రామ్ చరణ్ గురించి ప్రస్తావించలేదు. మాకు డేట్లు ఇచ్చారు. అయితే ఆ సమయంలో ‘ఇండియన్-2’ రావడం వల్ల శంకర్ గారు ఈ షూట్‌లో బిజీగా ఉన్నారు. దీంతో నేను చరణ్‌కు మరో స్టోరీ చూసుకోమని సలహా ఇచ్చాను. కానీ ఆయన అలా చేయకుండా ‘గేమ్ ఛేంజర్’ కోసమే టైమ్ ఇచ్చారు. నా హీరోను నేను కూర్చోబెడుతున్నాను. ఆయనను రెండో మూవీ చేయమని చెప్పా. ఎన్ని రోజులైనా ఆలోచించకుండా వచ్చారు. అది నాకు బిగ్ జర్నీ. అందుకే ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఎవరినీ నేను నిందించలేదు. శంకర్ గారి వల్ల వాయిదా పడుతూ వచ్చినా చరణ్ కంప్లీట్ చేశారు. అలాగే రెండు సినిమాలను ఒప్పుకున్నారు. ఏ హీరో అయినా ఇక ప్రాజెక్ట్ చేస్తుంటే మరోకటి ఒప్పుకోనివ్వరు. కానీ ఆ విషయంలో చిరంజీవి, చరణ్ మాకు సపోర్ట్‌గా నిలిచారు. అందుకే నేను వాళ్లకు థాంక్స్ చెప్తాను. ఒక సినిమా హిట్ అయి ‘గేజ్ ఛేంజర్’ ఆడకుంటే ఏ హీరోకు అయినా బాధగా ఉంటుంది. ఆయన ‘పెద్ది’ హిట్ అయ్యే వరకి ఆ బాధ వెంటాడుతుంది.
అందునే నేను కూడా ఆయనతో ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా స్టోరీ వస్తే దానిని చరణ్‌కు సెట్ చేసి దానికోసం నేను వర్క్ చేస్తాను. నిన్న శిరీష్ గారు మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్దగా మాట్లాడరు. అందుకే అలా అన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విషయంలో ఎమోషనల్ అయ్యారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లను నక్కతో పోల్చడం ఎమోషనల్ యాంగిల్‌లో చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ పరంగా అన్నారు. అంతేకాకుండా చరణ్‌పై కానీ శిరీష్‌కు చెడు ఉద్దేశం లేదు. తప్పు కానీ ఇంటెన్షన్ వేరు. ఎపిసోడ్ మొత్తం చూశాను. కానీ కొందరు క్లిప్స్‌ను మాత్రమే వైరల్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.






