OTT లో ఎన్ని వారాలకి సినిమాలు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇచ్చిన Dil Raju

by Disha Web Desk 7 |
OTT లో ఎన్ని వారాలకి సినిమాలు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇచ్చిన Dil Raju
X

దిశ, వెబ్‌డెస్క్: టికెట్లె ధరలు, తినుబండారాలపై మొన్నటివరకు చర్చలు జరిగి.. సినిమా షూటింగ్స్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. టికెట్ ధరలు, థియేటర్లలో తినుబండారాల రేట్లు, వీవీఎఫ్ ఛార్జీలపై మల్టీఫ్లెక్స్ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రేపు ఎగ్జిబిటర్లతో ఫైనల్ మీటింగ్ ఉందన్నారు. 8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తాము అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్వరలో షూటింగ్‌లు మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సింగిల్ స్క్రీన్ టికెటింగ్‌పై కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నట్లు దిల్ రాజు తెలియజేశారు.


Next Story

Most Viewed