మూసుకోండి అంటూ.. 'కార్తికేయ 2'ను అడ్డుకోవడంపై దిల్ రాజు ఘాటు వ్యాఖ్యలు..

by Disha Web Desk 7 |
మూసుకోండి అంటూ.. కార్తికేయ 2ను అడ్డుకోవడంపై దిల్ రాజు ఘాటు వ్యాఖ్యలు..
X

దిశ, సినిమా : నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ 2' సినిమా ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్‌లో దూసుకుపోతున్న మూవీకి రోజురోజుకు థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతున్న క్రమంలో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన దిల్ రాజు.. తాను 'కార్తికేయ 2' సినిమాను అడ్డుకున్నానని వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

తానెప్పుడూ మూవీని బతికించుకుందామని చూస్తానే తప్ప నాశనం చేయాలని అనుకోనని క్లారిటీ ఇచ్చాడు. నిఖిల్ ఫస్ట్ సినిమా 'హ్యాపీడేస్' నుంచి ఇప్పటి వరకు ప్రోత్సహిస్తున్న తనపై ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడమేంటని మండిపడ్డాడు. కేవలం క్లిక్స్, సబ్‌స్క్రిప్షన్స్ కోసం ఒకరిపై రాయి వేయాలనుకోవడం సమంజసం కాదని ఫైర్ అయ్యాడు. వాస్తవాలు తెలియనప్పుడు మూసుకోవాలి తప్ప అబద్దపు వార్తలు రాసి ఇతరుల పరువుతీయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'బింబిసార' మరో రికార్డు.. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి..

Next Story

Most Viewed