- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ క్రియేటర్స్ అంటే ఆలోచింప చేయగల ప్రతిభావంతులు: ప్రియాంక
హైదరాబాద్‌లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది.

దిశ, సినిమా: హైదరాబాద్‌లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ (DMF) నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్‌ను ఒక చోటుకు చేర్చింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ I&PR విభాగం ప్రత్యేక కమిషనర్ శ్రీమతి Ch. ప్రియాంక IAS పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగిస్తూ “డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం వినోదం మాత్రమే అందించేవారు కాదు. వారు విద్యావేత్తలు, ఆలోచింప చేయగల ప్రతిభావంతులు. అవార్డు గ్రహీతలు అందరినీ నేను అభినందిస్తున్నాను. మన సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను గుర్తించడానికి ఈ జాతీయ కార్యక్రమానికి నాయకత్వం వహించినందుకు భారత్ DMFకి అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.
సినిమా బిజినెస్, బాక్సాఫీస్ విశ్లేషణ, ఇండస్ట్రీ ఎక్సక్లూసివ్ న్యూస్ అందిస్తున్నందుకు గాను బాలీవుడ్ ప్రముఖులు తరణ్ ఆదర్శ్ డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - ఫిల్మ్ జర్నలిజం అవార్డు అందజేశారు. ఆయన మాట్లాడూతూ " భారత్ DMF నుండి ఈ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమ డిజిటల్‌గా అభివృద్ధి చెందడాన్ని నేను దగ్గరుండి చూశాను, ఈ మార్పులో భాగం కావడం నాకు గర్వకారణం" అని ప్రసంగించారు. తెలుగు సినిమా వేదికపై మరియు బుల్లితెరపై ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న తెలుగు యాంకర్ 'సుమ కనకాల'కు డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ “ ఈ అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషకరం. ఈ అవార్డు నాకు ఏంతో స్పెషల్. డిజిటల్ పరంగా మనం ఏంతో అభివృద్ధి చెందవచ్చు, కానీ ప్రేక్షకులతో సంబంధం స్థిరంగా ఉంటుంది," అని వ్యాఖ్యానించారు.






