- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’.. రణ్‌వీర్, మాధవన్ నటనకు కాజల్ అగర్వాల్ ఫిదా!
రణ్‌వీర్ సింగ్.. ఈ సినిమాలో నీ నటన నుండి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను. నీలోని తీవ్రత, నిజాయితీ, కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తున్నాయి.

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2025లో వచ్చిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, మార్చి 19న విడుదలై రికార్డులను తిరగరాస్తోంది. అంతేకాకుండా సినీ సెలబ్రిటీల ప్రశంసలు పొందుతోంది. తాజాగా, ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నోట్ విడుదల చేశారు. "రణ్‌వీర్ సింగ్.. ఈ సినిమాలో నీ నటన నుండి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను. నీలోని తీవ్రత, నిజాయితీ, కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తున్నాయి. నువ్వు నిజంగా ఈ కాలపు లెజెండ్‌వి. అలాగే ఆర్. మాధవన్ సర్.. మీలోని నిశ్శబ్ద బలం, క్లైమాక్స్ సీన్లలో మీ అధికారం అద్భుతం" అని పేర్కొన్నారు. యామీ గౌతమ్, సారా అర్జున్ ల నటనను కూడా ఆమె ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ముఖ్యంగా సంగీత దర్శకుడు శాశ్వత్ సచిదేవ్ అందించిన మ్యూజిక్ గురించి చెబుతూ.. "సంగీతం సినిమాకు కేవలం సపోర్ట్ ఇవ్వడమే కాదు, అందులో జీవించింది" అని కొనియాడారు. పార్ట్-1 అన్ ఫర్ గెటబుల్ అయితే, పార్ట్-2 మనల్ని ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను ఆకాశానికెత్తేశారు. అయితే ఈ సినిమా నటన పరంగానే కాకుండా.. కలెక్షన్ల పరంగా కూడా చరిత్ర సృష్టిస్తోంది. మార్చి 18న జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ. 43 కోట్లు వసూలు చేయగా, మొదటి రోజు మొత్తం వసూళ్లు రూ. 102.55 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ అనిపించుకుంటోంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను మెప్పిస్తూ.. బాక్సాఫీసును షేక్ చేస్తోంది.






