- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టాక్సిక్’ వాయిదాపై ధురంధర్ నటుడు సెటైరికలు కామెంట్స్.. యష్ ఫ్యాన్స్ ఫైర్
ఉద్రిక్తతలు మాకు కూడా ఉన్నాయి, కానీ మేము మాత్రం భయపడి వెనక్కి తగ్గడం లేదు.

దిశ, సినిమా: రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన మాస్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నిజానికి ఈ మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగాల్సింది. కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా అదే రోజున విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల ఆ సినిమా జూన్ 4కి వాయిదా పడింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల బిజినెస్ దెబ్బతింటుందనే భయంతో ‘టాక్సిక్’ టీమ్ వెనక్కి తగ్గింది. అయితే ఇదే విషయంపై ‘ధురంధర్’ నటుడు రాకేష్ బేడి స్పందిస్తూ.. "ఉద్రిక్తతలు మాకు కూడా ఉన్నాయి, కానీ మేము మాత్రం భయపడి వెనక్కి తగ్గడం లేదు. చెప్పిన టైమ్‌కే థియేటర్లలోకి వస్తున్నాం" అంటూ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ధురంధర్-2తో పోటీ పడటం ఎందుకని టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా వేశారని అర్థం వచ్చేలా అనడంతో యష్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. కాగా.. రణవీర్ సింగ్ పోషించిన ‘హంజా’ క్యారెక్టర్ అసలు స్పైగా ఎలా మారింది? పాకిస్థాన్ రాజకీయాల్లో అతను ఎదుర్కొన్న శత్రువులు ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సీక్వెల్ రాబోతోంది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రణవీర్ సరసన మరోసారి సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.






