- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధృవ్ విక్రమ్ ‘బైసన్’ ట్రైలర్ విడుదల.. బ్లాక్ బస్టర్ సంభవం అంటూ నెటిజన్ల కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison). మారి సెల్వరాజ్(Mari Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పశుపతి, రజిషా విజయన్, అమీర్, లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో మొదటగా ఓ పెద్ద నాగు పామును, ఓ చిన్న బాబును చూపించారు. ఇక ఇందులో 1980ల నాటి గ్రామీణ తమిళనాడు వాతావరణంలో, కబడ్డీ ఆటగాడి జీవిత పోరాటం, అణగారిన వర్గాల కష్టాలు, సామాజిక వివక్షపై వారి తిరుగుబాటు వంటి అంశాలను చూపించి ఆసక్తిని రేకెత్తించారు. ఇక అది చూసిన నెటిజన్లు బ్లాక్ బస్టర్ సంభవం అని కామెంట్లు చేస్తున్నారు.






