- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ ‘కుబేర’.. రన్‌టైమ్ రివీల్ చేయడంతో నెటిజన్లు షాక్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(dhanush), అక్కినేని నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబోలో తెరకెక్కుతున్న హోలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’(kubera).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(dhanush), అక్కినేని నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబోలో తెరకెక్కుతున్న హోలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’(kubera). శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLP బ్యానర్స్‌పై సునీల్ నారంగ్(Sunil Narang), పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు హైప్ పెంచాయి.
అయితే భారీ అంచనాల మధ్య ‘కుబేర’ జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సెన్సార్ పూర్తైయినట్టుల తెలుపుతూ రన్‌టైమ్‌ను వెల్లడించారు. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ రాగా.. ఏకంగా మూడు గంటల రన్‌టైమ్‌తో రాబోతుందని తెలిపారు. అలాగే భావోద్వేగం, ప్రేమ, దురాశ, థ్రిల్ అన్ని భావోద్వేగాలతో రాబోతుందని ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు.






