Dhamki Pre Release Event: విశ్వక్ సేన్ ఒక మాట అన్నాడు.. నాకు నిజంగా చాలా బాదేసింది: జూ.ఎన్టీఆర్

by Disha Web Desk 10 |
Dhamki Pre Release Event: విశ్వక్ సేన్ ఒక మాట అన్నాడు.. నాకు నిజంగా చాలా బాదేసింది: జూ.ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : విశ్వక్ సేన్ డైరెక్టర్ కమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ధమ్కీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా జూ.ఎన్టీఆర్ హాజరయ్యాడు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ .. " నాకొక్క మాట తను చెప్పాడు ఇందాక.. ఇప్పుడు ఇక్కడ చెప్పాలో ? చెప్పకూడదో తెలియదు.. కానీ చెబుతాను. విశ్వక్ సేన్ కాన్ఫిడెంట్ గా ఉండి, ఈ సినిమా తీసాడు. మీరు సినిమాని చూడాలనే ప్రయత్నం తనది కాదు.. నాది కాదు. విశ్వక్ సేన్ ఒక మాట అన్నాడు.. నాకు నిజం చాలా బాదేసింది. కార్ ఎక్కబోతూ అన్న ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేసాను.. ఈ సినిమాకు మీరు రావాలని తను అడుగుతున్నప్పుడు నాకు నిజంగా చాలా బాదేసింది. తర్వాత నేను ఆలోచించాను..తనకి ఒక మంచి సినిమా చేయాలనీ ఎంత పిచ్చో అప్పుడు అర్ధం అయింది. మన భాషలో దాన్ని పిచ్చి కూడా అంటారు. సినిమా అంటే అంత పిచ్చి తనకి.. ఇలాంటి ఆటిట్యూడ్, ఇలాంటి జీల్ ఉండేటటటువంటి తగ్గిపోకూడదు.. ఇలాంటి వాళ్లు మాత్రమే సినిమాను ముందుకు తీసుకెళ్లగలరు. ఇంత పిచ్చితో తీసిన సినిమాలు ఆడాలి.. అప్పుడే మనం ముందుకు వెళ్లగలుగుతామంటూ.." విశ్వక్ సేన్ని, ఎన్టీఆర్ తన మాటలతో ఆకాశానికి ఎత్తెసాడు.

Next Story

Most Viewed