- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య బాబు చెల్లిని మోసం చేసిన ఆ స్టార్ హీరో..?
పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దేవయాని..

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ ‘సుస్వాగతం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దేవయాని.. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో బాలయ్యకు చెల్లెలుగా నటించింది. అన్ని భాషల్లో కలిపి దాదాపుగా ఆమె 100 కు పైగా సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో దేవయాని గురించి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఓ హీరోతో ప్రేమలో పడి మోసపోయిందంటూ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే చాలా మంది దేవయాని ప్రేమించింది శరత్ కుమార్ అని చెప్పుకోగా.. మరి కొందరు మాత్రం అజిత్ అని అనుకునేవారు.
ఎందుకంటే ఈ ఇద్దరి స్టార్ హీరోలతోనే దేవయాని ఎక్కువ సినిమాలు తీసింది. ఈ క్రమంలోనే వీరు ఇద్దరిలో ఎవరో తెలియదు కానీ, ప్రేమించిన హీరో ఆమెను మోసం చేశాడని సమాచారం. ఇక రూమర్స్‌కు స్పందించని దేవయాని.. కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా.. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇప్పటికి పుట్టింటికి దూరంగానే ఉంటున్నట్లు టాక్. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి.. జనతా గ్యారేజ్, అరవింద సమేత లాంటి సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే.






