Pawan Kalyan-Anna Leznova:ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన డిప్యూటీ CM పవన్ భార్య.. ఎన్నోసారంటే?

by Kodari Anjali |   (  Updated:2024-07-20 15:19:26  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్‌గానే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Pawan Kalyan-Anna Leznova:ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన డిప్యూటీ CM పవన్ భార్య.. ఎన్నోసారంటే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్‌గానే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో అపజయాల తర్వాత పవన్ అఖండ విజయం సాధించారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులకు మరో భారీ శుభవార్త. విషయమేంటంటే..? రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు, జనసేన అధ్యకులు పవన్ కల్యాణ్ సతీమణి సతీమణి అన్నా లెజ్నోవా తాజాగా సింగపూర్ యూనివర్సీటీ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందారు. ఇది అన్నాకు రెండో మాస్టర్స్ డిగ్రీ కావడం విశేషం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయూసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్)లో అన్నా ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

ఇక అన్నా లెజ్నోవా రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదిచారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికి గాను మొదట డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్ బర్డ్ స్టేట్ యూనివర్సిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్ లోని చూలాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ లో అన్నా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

Next Story