‘షో మీ ది సీక్రెట్’.. రామ్‌చరణ్-దీపికల వీడియో వైరల్

by Dishaweb |
‘షో మీ ది సీక్రెట్’.. రామ్‌చరణ్-దీపికల వీడియో వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఓ మూవీలో కనిపించి అందరినీ షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్న ప్రాజెక్ట్‌లో చరణ్ నటించాడు. దీనికి సంబంధించి ‘షో మీ ది సీక్రెట్’ పేరుతో ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. చరణ్ కూడా తన ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. తప్పిపోయిన తన భర్త ఆచూకీ కోసం దీపిక పోలీసుల సహాయాన్ని కోరుతున్నట్లు వీడియోలో ఉంది. చరణ్, దీపిక ఈ కేసుకు సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. ఇందులో త్రిష కూడా కనిపించింది. ఇంతకు దీపికా భర్తకు ఏమైంది?, ‘ఈ కేసుకు చరణ్ ఎందుకు కనెక్ట్ అయ్యారు?, త్రిష ఎవరు?’ అనే ప్రశ్నలకు సమాధానాలన్నీ జూలై 5న వెలువడనుండగా ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read More: ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిక్షం అడుక్కున్న Vidya Balan.. ఆకలి తట్టుకోలేక

Next Story

Most Viewed