Deepika Padukone: కూతురి ఫేస్ రివీల్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన దీపికా.. పాప ఎంత ముద్దుగా ఉందో!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:17:55  IST  )

దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది రోజులుగా వివాదాలు, విమర్శలతో సతమత మవుతోంది.

Deepika Padukone: కూతురి ఫేస్ రివీల్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన దీపికా.. పాప ఎంత ముద్దుగా ఉందో!
X

దిశ, సినిమా: దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది రోజులుగా వివాదాలు, విమర్శలతో సతమత మవుతోంది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు అన్యాయం జరగకుండా పని గంటల విషయంలో ఒంటరి పోరాటం చేస్తోంది. 8 గంటలు మాత్రమే పని చేస్తానంటూ దర్శకనిర్మాతలకే కండీషన్లు పెడుతుండటం గమనార్హం. దీంతో ఇటీవల దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. అయినప్పటికీ తన చేతిలో ఉన్న సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వివాదాస్పద పోస్టులతో నెట్టింట ప్రభంజనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, దీపికా పదుకొణె అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇన్నాళ్లు తన కూతురి ముఖాన్ని చూపించకుండా.. జాగ్రత్త పడిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. దీపికా, రణ్‌వీర్‌ల గారాలపట్టి దువాను పరిచయం చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో రణ్‌వీర్ సింగ్ వైట్ కలర్ డ్రెస్ ధరించగా.. తల్లి కూతురు మాత్రం మెరున్ కలర్ డ్రెస్సులతో మెరిసిపోతున్నారు. దువా పిలకలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆ పాప బోసి నవ్వులు చూసి దీపికా, రణ్‌వీర్(Ranveer Singh) మురిసిపోతున్నారు. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సినీ సెలబ్రిటీలు హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ సైతం క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్, సో క్యూట్ అని కామెంట్లు చేశారు.

దువా(Dua Singh) పుట్టిన ఏడాది తర్వాత ఆమె ఫేస్ రివీల్ చేయడంతో.. అంతా ఆ పాప గురించే చర్చించుకుంటున్నారు. దీపికా కాపీ క్యాట్.. పార్లే జీ బిస్కెట్ల బిజినెస్‌కి కొత్త పాప దొరికిందంటూ పలు రకాలుగా స్పందించడంతో పాటు దువా ఫోటోలు వైరల్ చేసేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న పుట్టిన దువాను కనీసం బయటకు కూడా తీసుకురాకుండా.. ఈ స్టార్ కపుల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత కూతురిని పరిచయం చేయడంతో.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

READ MORE ......

శిరీష్‌కు కాబోయే భార్యను సైడ్ చేసేసిన అల్లు స్నేహ.. తెలివైనదే అంటున్న నెటిజన్లు

Next Story