బాలీవుడ్ భామకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఆమె చేసిన పని నచ్చకనే ఈ నిర్ణయం.. వంగానా మజాకా.. ఇక ఎంట్రీ ఇవ్వబోయేది అనుష్క..??

by Sujitha Rachapalli |

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వర్కింగ్ స్టైల్ అలగ్ ఉంటుంది. తను ఊహించుకున్న క్యారెక్టర్‌ను శాటిస్‌ఫై చేయట్లేదు అనుకుంటే ఎంత పెద్ద నటులనైనా ప్రాజెక్ట్ నుంచి లేపేస్తడు. ‘యానిమల్’ విషయంలో ఇదే జరిగింది.

బాలీవుడ్ భామకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఆమె చేసిన పని నచ్చకనే ఈ నిర్ణయం.. వంగానా మజాకా.. ఇక ఎంట్రీ ఇవ్వబోయేది అనుష్క..??
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వర్కింగ్ స్టైల్ అలగ్ ఉంటుంది. తను ఊహించుకున్న క్యారెక్టర్‌ను శాటిస్‌ఫై చేయట్లేదు అనుకుంటే ఎంత పెద్ద నటులనైనా ప్రాజెక్ట్ నుంచి లేపేస్తడు. ‘యానిమల్’ విషయంలో ఇదే జరిగింది. ముందుగా హీరోయిన్‌గా పరిణీతీ చోప్రాను ఎంచుకున్నా.. డేట్స్ దగ్గరపడే కొద్దీ ఆమె తను రాసుకున్న పాత్రకు కరెక్ట్ కాదనిపించడంతో.. తప్పుకోమని చెప్పాడు. రష్మికకు ఆ చాన్స్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఈ విషయాన్ని అటు పరిణీతి, ఇటు వంగ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఇప్పడు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘స్పిరిట్’ మూవీ ప్రకటించారు. భారీ పారితోషికంతో దీపికా పదుకొనేను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. కానీ ఆమె వర్కింగ్ స్టైల్ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేసినట్లు సోషల్ మీడియా టాక్. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇందుకు సంబంధించిన కథనాలు ప్రచురించగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇది విన్న నెటిజన్లు.. వంగానా మజాకా... ప్రభాస్‌కు జోడీగా అనుష్కను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ పోలీస్‌గా కనిపించబోతుండగా.. హీరోయిన్‌కు స్ట్రాంగ్ రోల్ ఉందని తెలుస్తోంది.

Next Story