నోరా ఫతేహి ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన నాతో లేకపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుందంటూ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 06:40:46  IST  )

నా ప్రయాణంలో మొదటి నుంచి ఆయన భాగస్వామి. ఆయన నా పక్కన ఉన్నప్పుడల్లా నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని.

నోరా ఫతేహి ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన నాతో లేకపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుందంటూ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. నోరా ఫతేహికి అత్యంత సన్నిహితుడు, ఆమె విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్నేహితుడు మార్స్‌ పెడ్రోజో కన్నుమూశారు. ఈ వార్త నోరాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన కెరీర్ మొదటి రోజు నుంచి ప్రతి అడుగులోనూ తనకు అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం ఆమె తట్టుకోలేకపోతున్నారు. మార్స్ కేవలం తనకు స్నేహితుడు మాత్రమే కాదని, ఒక సోదరుడిలా, తన రహస్యాలను పంచుకునే నమ్మకస్తుడిలా ఉండేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఈ రోజు నేను ఒక సోదరుడిని, నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను.

నా ప్రయాణంలో మొదటి నుంచి ఆయన భాగస్వామి. ఆయన నా పక్కన ఉన్నప్పుడల్లా నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నాలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఆయన బయటకు తీసేవారు. మేము ప్రతి పనిని కలిసే చేసేవాళ్లం. ఇంతకుముందు నేను ఎప్పుడూ స్నేహితుడిని కోల్పోలేదు.. అందుకే ఈ బాధ నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన నాతో లేకపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుంది" అంటూ నోరా కన్నీటి పర్యంతమయ్యారు. మార్స్‌ పెడ్రోజో ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నారని నోరా రాసుకొచ్చారు. తన స్నేహితుడు ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోవడం తనకు సాధ్యం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోరా పోస్ట్ చూసిన అభిమానులు ,సెలబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ, మార్స్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

క్యారవాన్‌లో అజిత్ చేసిన పనికి తమన్నా షాక్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

Next Story