- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

దిశ, సినిమా: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఈ వార్త విన్న పవన్ అభిమానులు ,బుల్లితెర సెలబ్రిటీలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తన తండ్రి అంటే పవన్‌కు ఎంతో ఇష్టం. క్యాన్సర్ బారిన పడిన తండ్రిని కాపాడుకోవడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ, చికిత్స పొందుతూ దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈ విషాద వార్తను పవన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన తండ్రి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని షేర్ చేస్తూ తన ఆవేదనను పంచుకున్నాడు. ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. పవన్ తండ్రి మరణ వార్త తెలియగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, టీవీ నటీనటులు ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా పవన్‌కు ధైర్యం చెబుతున్నారు. దుర్గా ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలి.. ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ స్నేహితులు ఆయన ఇంటికి చేరుకుని పవన్‌ను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం పవన్ షేర్ చేసిన ఎమోషనల్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






