నటి లారా దత్తా ఇంట్లో తీవ్ర విషాదం.. జీవితం ఎంత దుర్బలమైనదో అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-31 13:18:06  IST  )

బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా (Lara Dutta)ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

నటి లారా దత్తా ఇంట్లో తీవ్ర విషాదం.. జీవితం ఎంత దుర్బలమైనదో అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా (Lara Dutta)ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి రిటైర్డ్ వింగ్ కమాండర్ ఎల్‌కే దత్తా(LK Dutta)(84) అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించనప్పటికీ ఈ రోజు ముంబైలో జరిగిన అంత్యక్రియలకు ఆమె తన భర్త మహేష్ భూపతితో కలిసి వెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. కాగా, ఎల్‌కే దత్తా ఇటీవల మే 12న తన 84వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా లారా దత్తా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. ‘‘నిన్నటి రోలర్ కోస్టర్ భావోద్వేగాల రోజు.. మే 12.. నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు.

నా నాన్న పుట్టినరోజు మాత్రమే కాదు, 25 సంవత్సరాల క్రితం నేను మిస్ యూనివర్స్ గెలిచిన రోజు కూడా! కాలం ఖచ్చితంగా గడిచిపోతుంది!!! నాన్న జీవితాన్ని జరుపుకోవడానికి పూజతో నిన్నటి రోజును గుర్తించాను. జీవితం ఎంత క్షణికమైనది, దుర్బలమైనదో పూర్తిగా తెలుసుకుని, విశ్వం మనకు ప్రసాదించే బహుమతులను గుర్తించడం, వాటికి కృతజ్ఞతతో ఉండటం ముఖ్యం. గత 25 సంవత్సరాలుగా మీరు చూపిన ప్రేమకు మీ సహవాసానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె తండ్రి మరణించడంతే ఈ పోస్ట్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఇక లారా దత్తా సినిమాల.. విషయానికొస్తే.. ‘అందాజ్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే మహేష్ భూపతిని పెళ్లాడింది. అయినప్పటికీ వరుస సినిమాల్లో నటించింది. చివరగా.. లారా 2023లో వచ్చిన ఇష్క్-ఎ- నాదన్‌ మూవీతో ప్రేక్షకులను అలరించింది.

Next Story