వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతానంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-02 17:00:14  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పంచుకుంటున్న తన పెట్ మృతి చెందింది.

వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతానంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పంచుకుంటున్న తన పెట్ మృతి చెందింది. 12 ఏళ్లుగా తన బిడ్డగా ప్రేమానురాగాలతో పెంచుకుంటున్న కుక్క మరణించడంతో వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నా ప్రియమైన గూగుల్.. గత 12 సంవత్సరాలుగా మీరు మా జీవితాన్ని హద్దులేని ప్రేమతో, అందమైన జ్ఞాపకాలతో నింపారు. మీరు మా సూర్యరశ్మి. ఈ రోజు మేము మీకు వీడ్కోలు చెప్పాము. మీరు నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నా జీవితంలో నిండిన చీకటి గురించి మాటల్లో చెప్పలేను. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను నా ప్రియమైన మిత్రమా’’ అని రాసుకొచ్చారు. అలాగే తన పెట్ డాగ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇక వెంకీ మామ పోస్ట్ చూసిన నెటిజన్లు సెంటిమెంట్‌తో మనుషులనే కాదు.. కుక్కలను కూడా ఏడిపించగలరు మీరు తోప్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇటీవల దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో పాటు వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘శంకర వరప్రసాద్’ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్.

Next Story