‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హగ్ పోస్టర్‌తో హీట్ పెంచేసిన అడివి శేష్

by Mallepaka Hamsa |

సాంగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి

‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హగ్ పోస్టర్‌తో హీట్ పెంచేసిన అడివి శేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రియేటివ్ హీరో అడివి శేష్(Adivi Sesh) నుంచి సినిమా వస్తుందంటేనే అందులో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. ఇప్పుడు ఆయన తన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit) తో ప్రేక్షకులను ఒక రొమాంటిక్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లబోతున్నారు. షానిల్ డియో దర్శకత్వంలో, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా థ్రిల్లర్ నుంచి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. సాధారణంగా దొంగల కథలంటే కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ శేష్ తన ‘డెకాయిట్’ లో బలమైన ఎమోషన్‌ను జోడించారు. తాజాగా, ఈ సినిమా మ్యూజిక్ జర్నీని ప్రారంభిస్తూ.. ఫిబ్రవరి 27న ‘రూబారూ’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పాట గురించి శేష్ చెప్పిన మాటలు సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాయి. ‘‘అతను ఆమెను ప్రాణంగా ప్రేమించాడు.. కానీ ఆమె అతనికి ఊహించని ద్రోహం చేసింది.

తను ఒక దోపిడీదారుడిగా మారడానికి ముందు అతని జీవితంలో జరిగిన ఆ విలయం ఏంటి? అతను అనుభవించిన ఆవేదన ఏంటి?’’ అనేది ఈ పాట ద్వారా అర్థమవుతుందని క్యాప్షన్ ద్వారా హింట్ ఇచ్చాడు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో అడివి శేష్ మృణాల్‌ను ఎంతో గాఢంగా హగ్ చేసుకుని కనిపిస్తుంటే.. మరో పోస్టర్‌లో మృణాల్ చిరునవ్వును శేష్ ఎంతో ఆరాధనగా చూస్తున్నాడు. చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా, క్లాసీగా ఉన్న ఈ పోస్టర్లు చూస్తుంటే.. మృణాల్ పాత్రే హీరోను ‘డెకాయిట్’ గా మార్చేసిందా? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఈ రెండు పోస్టర్లు క్యూరియాసిటీని పెంచడంతో పాటు అంచనాలను పెంచుతున్నాయి. కాగా.. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. శరణ్ రాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని టాక్.

Next Story