- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశా పటానీతో డేటింగ్.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన సింగర్.. ట్విస్ట్ అదిరిపోయింది!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani)మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani)మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాల వల్లనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. టైగర్ ష్రాఫ్‌తో లాంగ్ రిలేషన్‌షిప్‌కు బ్రేక్ పడిన తర్వాత, ఈ భామ పంజాబీ పాప్ సింగర్ తల్విందర్ సింగ్‌తో ప్రేమలో ఉందంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ పెళ్లి వేడుకల్లో దిశా, తల్విందర్ జంటగా సందడి చేయడంతో ఈ పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దిశా కొత్త ప్రియుడు ఇతడేనంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తల్విందర్ సింగ్ (Talwinder Singh)ఈ వార్తలపై ఘాటుగానే స్పందించాడు. "మాపై ఇంత త్వరగా అందరి దృష్టి పడుతుందని ఊహించలేదు. మేం ఒకరినొకరు పరిచయమై కొద్ది కాలమే అవుతోంది. ప్రస్తుతం ఒకరి గురించి ఒకరం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇలాంటి పుకార్ల వల్ల వచ్చే ఒత్తిడిని మేం కోరుకోవడం లేదు.
మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి" అని తల్విందర్ స్పష్టం చేశాడు.అయితే, ఇంటర్వ్యూ చివరలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు తల్విందర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. "మీకు ప్రేమపై నమ్మకం ఉందా?" అని అడగ్గా.. "నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను" అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో అతను దిశాను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడా? అనే చర్చ మళ్ళీ మొదలైంది. కొంతమంది ట్విస్ట్ అదిరిపోయిందని అంటున్నారు. కాగా.. దిశా పటానీ గతంలో మోడల్ అలెగ్జాండర్ అలెక్సిక్‌తో కూడా ఇలాగే సన్నిహితంగా కనిపించింది. అయితే అప్పుడు కూడా అది కేవలం స్నేహమేనని తేలిపోయింది. మరి ఇప్పుడు తల్విందర్ విషయంలో ఇది కేవలం ఫ్రెండ్‌షిప్‌తోనే ఆగిపోతుందా లేక పెళ్లి పీటల వరకు వెళ్తుందా అన్నది? తేలాల్సి ఉంది.






