- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ నాయకుడితో డేటింగ్.. హోటల్‌లో అడ్డంగా దొరికిపోయిన యంగ్ హీరోయిన్.. (వీడియో)
ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు తమ సహ నటులతో డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది.

దిశ, సినిమా: ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు తమ సహ నటులతో డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది. కొద్ది కాలం పాటు ఎంజాయ్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఒకేచోట కనిపించినా.. డేటింగ్ పుకార్లు ఎక్కువైపోతున్నాయి. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా ఓ రాజకీయ నాయకుడితో హోటల్‌లో అడ్డంగా దొరికిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్. పలు చిత్రాల్లో నటించడంతో పాటు వాతావరణ పరిరక్షణకు తన వంతు పాటుపడుతూ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా చేరింది.
అన్ని రంగాల్లో ఉన్న భూమి ముంబైలోని బాంద్రా ఉన్న ఓ హోటల్‌లో రాజకీయ నాయకుడు ఆదిత్య ఠాక్రేతో కనిపించింది. వీరితో పాటు మరికొందరు సన్నిహితులు కూడా ఉన్నారట. యంగ్ గ్లోబల్ లీడర్స్ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేయగా.. అందులో వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రమే వైరల్ అవుతుండటంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వారు ఆ పార్టీలో మాత్రమే హాజరయ్యారు. అంతే తప్ప వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందనేది తెలియనప్పటికీ డేటింగ్ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.






