- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘GOAT’ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..
ట్రైలర్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకుని హీరోగా మారిన సుడిగాలి సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘గాలోడు’ వంటి మాస్ హిట్ తర్వాత సుధీర్ నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సినిమా, విడుదల, ట్రైలర్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నిజానికి ఈ సినిమా మార్చి 26నే థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల, ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం.. ‘GOAT’ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 17న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
వేసవి సెలవుల అడ్వాంటేజ్ కూడా తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద సుధీర్ రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో సాగే ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అని టాక్. వేదవ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సుధీర్ సరసన గ్లామరస్ బ్యూటీ దివ్యభారతి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక అసలైన వేట మొదలుపెట్టేందుకు ఏప్రిల్ 6న పవర్ ఫుల్ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు సుధీర్ స్వయంగా వెల్లడించారు. ఈ ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఏంటో చూపించబోతున్నామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.






