మరింత బోల్డ్‌గా.. నాలుగు గంటల నిడివితో ‘బేబి’ స్ట్రీమింగ్.. ఓటీటీ రిలీజ్కి డేట్ ఫిక్స్

by Disha Web Desk 10 |
మరింత బోల్డ్‌గా.. నాలుగు గంటల నిడివితో ‘బేబి’ స్ట్రీమింగ్..  ఓటీటీ రిలీజ్కి డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘బేబి’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. కేవలం 9 రోజుల్లో రూ. 60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 18 నుంచి ప్రసారం కాబోతోంది. అయితే సమాచారం ప్రకారం థియేటర్స్‌లో సెన్సార్ బోర్డు కట్ చేసిన సీన్స్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. మొత్తానికి నాలుగు గంటల నిడివితో.. మరింత బోల్డ్‌గా మెప్పించేందుకు రెడీ అవుతోంది ‘బేబి’.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed