దాసరి నారాయణ రావు గారు మా తాతగారు.. బిగ్‌షాకిచ్చిన రవితేజ హీరోయిన్

by Mallepaka Hamsa |

‘గద్దలకొండ గణేష్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి(Dimple Hayathi).

దాసరి నారాయణ రావు గారు మా తాతగారు.. బిగ్‌షాకిచ్చిన రవితేజ హీరోయిన్
X

దిశ, సినిమా: ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి(Dimple Hayathi). తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. చెప్పుకోదగ్గ భారీ హిట్ లేకపోవడంతో, కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయినప్పటికీ అమ్మడుకి అవకాశాలకు ఏం కోదవలేదు. పలు చిత్రాల్లో నటించే చాన్స్ వచ్చినప్పటికీ విజయాన్ని మాత్రం అందులకోలేకపోయాయి. ఇక 2023లో విడుదలైన ‘రామబాణం’తో ప్రేక్షకులను అలరించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో డింపుల్ హయాతి దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్లీ బలమైన రీఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పుడు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌తో పాటు డింపుల్ హయాతి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న డింపుల్ హయాతి తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘దాసరి నారాయణ రావు గారు(Dasari Narayana Rao) మా తాతగారు. అలాగే ఒకప్పటి హీరోయిన్ ప్రభ(Prabha)గారు మా నాన్నమ్మ అవుతుంది. మా కుటుంబంలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అయితే నేను సినిమాల్లో వస్తానంటే మాత్రం అంగీకరించలేదు. కానీ నటనపై నాకు ఉన్న ఆసక్తి చూసి నాకు సపోర్ట్ చేశారు. లేకుంటే నేను ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. అతి కష్టం మీద ఒప్పించాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story