Dasara Movie: యూఎస్‌లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న నాని 'దసరా" సినిమా

by Disha Web Desk 10 |
Dasara Movie: యూఎస్‌లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న నాని దసరా సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ చేసిన నాని దసరా సినిమాతో సెన్సేషన్ క్రియోట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టిన హిట్స్ కొట్టిన టైర్ 2 గా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుంది. సెంటర్ ఏదైనా సూపర్ హిట్ అనే ఒక్క మాట మాత్రమే వినిపిస్తుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.38 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు ముగిసే సమయానికి రూ.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. యూఎస్ లో రెండో రోజు 1.2 మిలియన్ డాలర్స్ ను రాబట్టింది. దీంతో ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ అయింది. ఓవర్శిస్ లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు ఏడు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీ‌ఆర్ ప్లేస్‌ని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌లో నాని నిలిచాడు. నాని కెరియర్లో ఇప్పటి వరకు ఎనిమిది 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలుఉన్నాయి. ఈ రేసులో మహేష్ బాబు మొదటి ప్లేసులో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: నాని ‘దసరా’ మూడో రోజు వసూళ్లు..

Next Story

Most Viewed