Das Ka Dhamki: బ్రేకింగ్ న్యూస్.. రూ. 10వేల కోట్ల స్కామ్ చేసిన విశ్వక్ సేన్?

by Disha Web Desk 10 |
Das Ka Dhamki: బ్రేకింగ్ న్యూస్.. రూ. 10వేల కోట్ల స్కామ్ చేసిన విశ్వక్ సేన్?
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి నెట్టింట ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ‘తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న వార్త! మొత్తం పదివేల కోట్ల స్కామ్!! ఇంతకూ ఏం జరిగింది..?’ అని తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ పోస్ట్ పెట్టింది. ‘బ్రేకింగ్ న్యూస్.. 10వేల కోట్ల స్కామ్ చేసిన విశ్వక్?’ అంటూ ఫొటో పోస్ట్ చేసింది. అయితే ఇదంతా ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కాగా ఈ మూవీ ఆహా‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్స్.. సినిమా బాగుంది కానీ ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా అని విమర్శిస్తున్నారు.


Next Story