- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న దంగల్ నటి సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో క్యూరియాసిటీ పెంచిన డైరెక్టర్
బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సన షేక్(Fatima Sana Sheikh) ‘దంగల్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సన షేక్(Fatima Sana Sheikh) ‘దంగల్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘మెట్రో ఇన్ దినో’(Metro in Dino') చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఫాతిమా నటించిన ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi)సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. వివేక్ సోని (Vivek Soni)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో మాధవన్ హీరోగా నటించగా.. కుమార్ కాంచన్ ఘేష్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్(Karan Johar), అదార్ పూర్ణ వాలా, అపూర్వ మెహతా(Apoorva Mehta), సోమెన్ మిశ్రా నిర్మించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 11న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘గజిబిజిగా, సన్నిహితంగా ఉండే ప్రేమకథను తీసుకురాబోతున్నాను. మన చూట్టూ నిర్మించుకున్న కొన్ని కట్టుబాట్లను ఈ సినిమాలో చూపించాము. వాటి నుంచి ఎలా విముక్తి పొంతాలనే దాన్ని ఇందులో వివరించాము. కొన్ని విషయాలను మా చిత్రం నిశ్వబ్దంగా ప్రశ్నిస్తుంది. మాధవన్, ఫాతిమా వారి పాత్రలకు న్యాయం చేశారు. నేటి ప్రపంచానికి కచ్చితంగా మా ‘ఆప్ జైసా కోయి’ మూవీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






