- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నో రహస్యాలతో నియమాలను తిరగ రాయడానికి ‘దక్ష’ వస్తోంది.. హైప్ పెంచుతున్న హీరోయిన్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చిత్ర శుక్ల(Chitra Shukla) ‘దక్ష’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చిత్ర శుక్ల(Chitra Shukla) ‘దక్ష’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెడికల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi Prasanna), సిద్ధిఖీ, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహిత మోహన్ బాబు(Mohan Babu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు అందించిన కథతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశ్వంత్, మహేష్, విరేన్, తంబి దొరై, సముద్రఖని, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మంచు ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అచ్చు రాజమణి సంగీతం అందిస్తోంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ హీరోయిన్ చిత్ర శుక్ల పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆమె ‘మిథిలా’ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘మిథిలా ముఖం అమాయకంగా కనిపిస్తుంది. కానీ మీరు తెలుసు అనుకున్న.. ప్రతి దాన్ని బద్దలు కొట్టే రహస్యాలతో ఆమె పాత్ర ఉండబోతుంది. ప్రపంచంలో సున్నితమైన స్వరంతో ఉంటుంది. కానీ ఆమె సైలెన్స్‌ను బలహీనతగా పొరపాటు పడకండి. నియమాలను తిరగరాయడానికి ‘దక్ష’ మీ ముందుకు వస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది.






