ఘనంగా జరిగిన దగ్గుబాటి మనవడు పుట్టినరోజు వేడుక

by Harish |

దగ్గుబాటి ఫ్యామిలీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు.

ఘనంగా జరిగిన దగ్గుబాటి మనవడు పుట్టినరోజు వేడుక
X

దిశ, సినిమా: దగ్గుబాటి ఫ్యామిలీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. వెంకటేష్, రానా తమ మూవీస్‌కి సంబంధించిన అప్ డేట్‌లు మాత్రమే షేర్ చేస్తారు. కానీ, వారి ఫ్యామిలీల గురించి మాత్రం ఏ విషయం షేర్ చెయ్యలేదు. ఇక ఇప్పటి వరకు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికీ అంతగా తెలియదు. అయితే రీసెంట్‌గా ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. సురేష్ బాబుకి రాణా, అభిరాంతో పాటు ఒక కూతురు కూడా ఉంది. తన పేరు మాళవిక. ఇటీవలే మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు. అయితే రీసెంట్‌గా ఆమె కొడుకు మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో వెంకటేష్ ముగ్గురు కూతుర్లు, కొడుకు అర్జున్, నాగచైతన్య తో పాటు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Next Story