కల్ట్ కెప్టెన్ ఆన్ డ్యూటీ.. ‘ఉస్తా్ద్ భగత్‌సింగ్’ షూటింగ్ అప్డేట్‌‌ ఇచ్చిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh).

కల్ట్ కెప్టెన్ ఆన్ డ్యూటీ.. ‘ఉస్తా్ద్ భగత్‌సింగ్’ షూటింగ్ అప్డేట్‌‌ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish Shankar)దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రబృందం మళ్లీ షూటింగ్ ప్రారంభించనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు సెట్స్​ నుంచి ఓ ఫొటో రిలీజ్ చేశారు.

సెట్స్​లో ఓ చేతిలో గన్, మరో చేత్తో పై నుంచి వేలాడుతున్న తాడు పట్టుకొని ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఫొటోను పోస్ట్ చేశారు. పైన లైటింగ్, కర్రలతో అమర్చిన భారీ సెటప్ ఫొటోలో కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘‘'కల్ట్ కెప్టెన్ హరీశ్ ఆన్ డ్యూటీ. ఉస్తాద్ షూటింగ్ ఇవాళ పునః ప్రారంభం అయ్యింది. అప్డేట్స్ కోసం వేచి ఉండండి. గుర్తుందిగా! ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు. అంతకుమించి ఉండనుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. నవంబర్ చివరి వారంలోపే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. కాగా.. పవన్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

LINK

Next Story