- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్-నీల్ సినిమా పై క్రేజీ బజ్.. అక్కడ స్టార్ట్ కానున్న న్యూ షెడ్యూల్(ట్వీట్)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ, విదేశాల్లోనూ, భాగ్యనగరంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 1969 కాలంలో చైనా, బూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపు జోర్డాన్‌లో ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్‌లో 3 భారీ పోరాట సన్నివేశాలను కలిగి ఉంటుందట. టొవినో థామస్ ఒక శక్తివంతమైన పాత్రలో చేరి, ఎన్టీఆర్‌తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






