- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘AK-64’ సినిమాలో క్రేజీ బ్యూటీ.. 54 ఏళ్ల హీరోతో అవసరమా అంటూ హీరోయిన్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన ఖాతాలో ఒక్క హిట్ పడటం లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన ఖాతాలో ఒక్క హిట్ పడటం లేదు. ఇటీవల విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. వరుసగా రెండు డిజాస్టర్లతో నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా.. వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘AK-64’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్వాసిక కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ‘AK-64’ నటీనటులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల, అజిత్ కుమార్ సరసన నటిస్తున్నట్లు నెట్టింట పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ శ్రీలీలను సంప్రదించగా.. ఆమెకు కథ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అవసరమా అని అంటున్నారు. నీకు చాన్సులే రానట్లు 54 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావని శ్రీలీలను తిడుతున్నారు.






