- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కూలీ’ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో దుమ్మురేపిన పూజా హెగ్డే.. కలిసొచ్చేనా? (వీడియో)
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(Coolie).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(Coolie). ఈ చిత్రాన్రి సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde)స్టెప్పులేయనుంది. ఐటెం సాంగ్ చేస్తోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేశాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘కూలీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ మోనికా అని సాగే పాటను విడుదల చేశారు. ఇక ఇందులో ఓ ఫ్యాక్టరీలో వందల మందిలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్ ధరించి థైయ్స్ షో చేస్తూ వావ్ అనిపించింది. ఇక ఆ పాటలో మాస్ స్టెప్స్ వేసిన ఈ భామ దుమ్మురేపింది. హిట్స్ లేక ఐరన్ లెగ్ అనిపించుకుంటున్న పూజా హెగ్డేకు ఆ పాట కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు హిట్ అవడం ఖాయమని అంటున్నారు. మరికొందరు మాత్రం ఐటెం సాంగ్స్ చేసిన ఇతర హీరోయిన్లతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మోనికా సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.






